RHUMI 1 Rocket: రూమీ1 హైబ్రిడ్ రాకెట్‌ను పరీక్షించిన ఇండియా.. వీడియో
RHUMI 1 Rocket: రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ1ను ఇవాళ పరీక్షించారు. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. చెన్నై తీరం నుంచి దీన్ని పరీక్షించారు. 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లను ఆ రాకెట్ మోసుకెళ్లింది.
చెన్నై: మొట్టమొదటిసారి రూమీ1(RHUMI 1 Rocket).. రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్‌ను .. ఇండియా తొలిసారి పరీక్షించింది. తమిళనాడుకు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ .. ఈ రాకెట్‌ను డెవలప్ చేసింది. మొబైల్ లాంచర్ ద్వారా .. చెన్నైలోని తిరువిదందై నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. రూమీ1 రాకెట్ ద్వారా.. మూడు క్యూబ్ శాటిలైట్లు, 50 పికో శాటిలైట్లను.. ఉపకక్ష్యలోకి పంపారు.
#WATCH | India launches its first reusable hybrid rocket, RHUMI 1. The rocket, developed by the Tamil Nadu-based start-up Space Zone India and Martin Group was launched from Thiruvidandhai in Chennai using a mobile launcher. It carries 3 Cube Satellites and 50 PICO Satellites… pic.twitter.com/Io97TvfNhE
— ANI (@ANI) August 24, 2024
పేలోడ్‌ను రిలీజ్ చేసిన తర్వాత.. హైబ్రిడ్ రాకెట్ మళ్లీ సముద్రంలో పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని రికవర్ చేస్తారు. లిక్విడ్ ఆక్సిడైజర్, ఘన ఇంధనాన్ని .. ఈ హైబ్రిడ్ ఇంజిన్ కోసం వాడుతున్నారు. క్యూబ్, పికో శాటిలైట్లను.. 35 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలో ఈ రాకెట్ వదిలేస్తుంది.
రాకెట్‌కు వాడిన ఎయిర్‌ఫ్రేమ్‌ను కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్‌తో చేశారు. పారాచూట్ డెవలప్మెంట్ టెక్నిక్‌ను కూడా వాడారు. ఖర్చును తగ్గించాలన్న ఉద్దేశంతో రీయూజబుల్ రాకెట్‌ను తయారు చేసినట్లు స్టార్ట్ అప్ కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా.. నైట్రస్ ఆక్సైడ్, వాక్స్ ఫుయల్ను వాడినట్లు ఆ కంపెనీ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

