PM Modi | భారతదేశం ఇప్పుడు ప్రపంచశక్తిగా మారుతోంది : ప్రధాని మోదీ
PM Modi | ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని తెలిపారు.
PM Modi : ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని తెలిపారు. భారత్ రోజుకో రికార్డును సృష్టిస్తోందని, భారతదేశ నిర్వహణ నైపుణ్యాన్ని, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు.
శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాంక్లేవ్ 2025 (NXT Conclave 2025) లో ప్రధాని మాట్లాడుతూ.. భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, భారత్‌కు రావాలని తహతహలాడుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 26న ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మహాకుంభ్-2025 గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఒక టెంపరరీ సిటీలో నదీతీరాల వెంబడి కోట్లాది మంది ప్రజలు పవిత్రస్నానాలు చేయడం.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
భారతదేశం గ్లోబల్ శక్తిగా ఎదుగుతున్న వైనాన్ని మోదీ వివరిస్తూ.. ఏఐ సదస్సులో భారతదేశం కో-హోస్ట్‌గా వ్యవహరించిందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ కీలక భూమిక పోషించనుందని చెప్పారు. తదుపరి ఏఐ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఏఐ, గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ల ద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ డిప్లొమసీలో ఎదుగుతున్న శక్తిగా భారత్ కీలకపాత్ర పోషించనుందని స్పష్టంచేశారు.
భారతదేశం సెమికండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ లాంటి వాటితో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా కూడా మరిందని ప్రధాని చెప్పారు. భారతదేశం పాటించే యోగా, ధ్యానం లాంటివి విదేశీయులు ఆచరిస్తున్నారని, మన సూపర్‌ఫుడ్ మఖానా, మిల్లెట్, ఆయుష్ ఉత్పత్తులు విరివిగా వాడుతున్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

