న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్)ను జారీ చేసింది.
తాజాగా నోటమ్ పరిధిని పెంచడంతో అత్యంత ముఖ్యమైన క్షిపణి వ్యవస్థను పరీక్షించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు పెరిగాయి. ఇది సముద్రంపై దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్షిపణి పరీక్ష అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే, ప్రయోగ వేదిక, క్షిపణి వ్యవస్థ గురించి అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ లేదు.