Rahul Gandhi | దేశానికి బలహీనమైన ప్రధాని ఉన్నడు : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi).. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై మరోసారి విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi).. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశం ఒక బలహీనమైన ప్రధానిని కలిగి ఉన్నదని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
‘ఐ రిపీట్, ఇండియా హాజ్ ఎ వీక్ పీఎం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. 2017లో కూడా హెచ్1బీ (H1B) వీసా అంశాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ‘ఇండియా హాజ్ ఎ వీక్ పీఎం’ అని అప్పట్లో పోస్టు పెట్టారు. తాజాగా హెచ్1బీ (H1B) వీసాలకు ఒక లక్ష డాలర్ల (సుమారుగా రూ.88.80 లక్షలు) ఫీజు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనిపై కూడా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. అంతేగాక ‘ఐ రిపీట్, ఇండియా హాజ్ ఎ వీక్ పీఎం’ అని పోస్టు పెట్టి, 2017లో ‘ఇండియా హాజ్ ఎ వీక పీఎం’ అని తాను పెట్టిన పోస్టును గుర్తుచేశారు.
రాహుల్‌గాంధీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మనీశ్ తివారీ, పవన్ ఖేరా తదితరులు కూడా ట్రంప్ హెచ్1బీ (H1B) వీసాల జారీకి లక్ష అమెరికన్ డాలర్ల ఫీజు విధించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో కోట్ల మంది భారత యువతకు నష్టం వాటిల్లనుందని చెప్పారు. అమెరికా ఒక క్రమపద్ధతిలో ఇండియాకు ఉచ్చు బిగిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్‌తో కాల్పుల విమరణకు ఒప్పించామని చెప్పడం, భారత ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచడం, ఇప్పుడు వీసాలపై రుసుములు విధించడం లాంటివన్నీ అమెరికా ప్లాన్డ్గా చేస్తోందని, దీనిపై భారత్ చడీచప్పుడు లేకుండా ఉంటోందని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

