న్యూఢిల్లీ, జూన్ 12: చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది. చైనా, పాక్ నుంచి ముప్పు పెరగటంతో, అణ్వాయుధ సామర్థ్య పెంపుపై భారత్ దృష్టిసారించిందని తెలిపింది.
తాజా నివేదిక ‘ఇయర్‌బుక్ 2023’ను సిప్రి సోమవారం విడుదల చేసింది. ఉ క్రెయిన్‌పై రష్యా యుద్ధం అణు నిరాయుధీకరణపై పెద్ద దెబ్బ కొట్టిందని నివేదికలో అమెరికా శాస్త్రవేత్త హన్స్ ఎం క్రిస్టెన్సెన్ ఆందోళన వ్యక్తం చేశారు.