సూరత్: భారత్లో టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల్లో ఆగే పరిస్థితులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి! దేశంలోనే ఎలాంటి అడ్డంకులు లేని తొలి టోల్ ప్లాజాగా సూరత్ సమీపంలోని చోర్యాసి గుర్తింపు పొందింది. ఇక్కడ అమలవుతున్న హైటెక్ విధానం వల్ల వాహనాలేవీ ఆగకుండా ముందుకు సాగిపోయే సౌకర్యం ఉన్నది.
ప్లాజా పై భాగంలోని సెన్సర్లు, కెమెరాలు వాహనదారుల వాహనాన్ని ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ స్టికర్స్ సాయంతో ఫొటో తీసి అక్కడికక్కడే చెల్లింపులు చేసే సదుపాయం కల్పిస్తాయి. ప్రయాణాలు సాఫీగా, 30 శాతం వేగంగా సాగడానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.