న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో ఆడపిల్లలపై వివక్ష క్రమంగా తగ్గుతున్నది. స్త్రీ, పురుషుల లింగ నిష్పత్తి మెరుగుపడింది. దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం దేశంలో స్త్రీలు, పురుషుల నిష్పత్తి 1,020:1,000గా ఉంది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నారన్నమాట. ఈ మేరకు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఓ ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.