న్యూఢిల్లీ: ఎగుమతుల సుంకం నుంచి బాస్మతియేతర తెల్ల బియ్యానికి మినహాయింపు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే పారాబాయిల్డ్ రైస్‌పై లెవీని 10 శాతం తగ్గించింది.
బ్రౌన్ రైస్, ధాన్యం ఎగుమతులపైనా ఎగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఇప్పటివరకు వివిధ రకాల బియ్యం ఎగుమతులపై ఎగుమతి సుంకం 20 శాతంగా ఉంది.