CEC Rajiv Kumar: చరిత్ర సృష్టించిన భారత్.. ఓటేసిన 64.2 కోట్ల మంది
CEC Rajiv Kumar: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులు పనిచేసిన తీరు వల్లే కొన్ని చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు. గత నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు సీఈసీ తెలిపారు. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారి అని, దీని కోసం రెండేళ్ల ప్రిపరేషన్ జరిగిందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల కమీషనర్లను లాపతా జెంటిల్మెన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం పట్ల సీఈసీ స్పందించారు. తాము ఇక్కడే ఉన్నామని, ఎక్కడికీ వెళ్లలేదని ఆయన అన్నారు. సుమారు 68 వేల మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది.. తాజా లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించినట్లు ఆయన తెలిపారు. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1692 విమాన సర్వీసులను వాడినట్లు తెలిపారు.
లోక్సభ ఎన్నికల వేళ పది వేల కోట్ల నగదును సీజ్ చేసినట్లు సీఈసీ తెలిపారు. డ్రగ్స్, మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 495 ఫిర్యాదులు వచ్చాయని, దాంట్లో 90 శాతం తక్షణమే పరిష్కరించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. టాప్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. డీప్ ఫేక్, ఏఐ ఆధారిత కాంటెంట్ను చాలా వరకు నియంత్రించినట్లు ఆయన తెలిపారు.
#WATCH | On Lok Sabha elections, CEC Rajiv Kumar says, “Due to the meticulous work of the election personnel we ensured fewer repolls – we saw 39 repolls in Lok Sabha polls 2024 as opposed to 540 in 2019 and 25 out of 39 repolls were in 2 States only.” pic.twitter.com/7cwDYuLWPR
— ANI (@ANI) June 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

