న్యూఢిల్లీ: అధునాతన అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత దేశం శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. బహుళ స్వతంత్ర లక్ష్యాలు కలిగిన రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో దీనిని తయారు చేశారు. ఒడిశా కోస్తా తీరంలో దీనిని ప్రయోగించారు.
వివిధ లక్ష్యాలపైకి ఈ క్షిపణి బహుళ పేలోడ్లను ప్రయోగించ గలదు. అంటే ఒకసారి ప్రయోగంతో వివిధ లక్ష్యాలను ఇది ఛేదించగలదు. బహుళ పేలోడ్లను ఉంచి ఒకేసారి ఏకకాలంలో వివిధ లక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయోగ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్టు భారత రక్షణ శాఖ వెల్లడించింది.