న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేవారికి కేంద్రం ఏటా భారత పౌరసత్వం ఇస్తుంది. 2016 నుంచి 2020 వరకు గడిచిన ఐదేండ్లలో మొత్తం 4,177 మంది భారత పౌరసత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవాళ లోక్సభలో ప్రకటించారు. ఆన్లైన్ సిటిజన్ షిప్ మాడ్యూల్ నుంచి సేకరించి డేటా ప్రకారం.. గత ఐదేండ్లలో 4,177 మంది భారత పౌరసత్వం పొందగా.. 2016లో అత్యధికంగా 1106 మంది భారత పౌరసత్వం తీసుకున్నారు.
2018లో అతి తక్కువగా 628 మందికి మాత్రమే భారత పౌరసత్వం దక్కింది. ఇక 2016 నుంచి 2020 వరకు వరుసగా భారత పౌరసత్వం పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
4,177 persons granted Indian citizenship during the last five years: MoS Home in Lok Sabha pic.twitter.com/IG9llmdFtG
— ANI (@ANI) November 30, 2021