హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కంటెంట్‌ను, ఆ దేశ ప్రేరేపిత కంటెంట్‌ను ఓటీటీల్లో నిషేధిస్తూ గురువారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో పలు కీలక అంశాలను కేంద్రం ప్రస్తావించింది.