INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
INDIA bloc : వోట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ కూటమి నేతలు ఇప్పటికే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12, సోమవారం ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
INDIA bloc : వోట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ కూటమి నేతలు ఇప్పటికే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు కూటమి సిద్ధమైంది. అక్టోబర్ 12, సోమవారం ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. సర్ ప్రక్రియను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ అంశాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు సోమవారం భారీ నిరసన కార్యక్రమానికి ఇండియా బ్లాక్ సిద్ధమైంది. ఈ అంశాలపై శుక్రవారం రాత్రి ఇండియా బ్లాక్ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మెమొరాండం సమర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. వోట్ చోరీ అంశాన్ని రాష్ట్రపతి ఖండించలేదని రాహుల్ అన్నారు. అలాగే, దీనిపై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి మెమొరాండం సమర్పించాలని నిర్ణయించినట్లు రాహుల్ గాంధీ వివరించారు. అలాగే, సీఈసీపై చర్యలు తీసుకోకుండా చట్టం కల్పించిన రక్షణ హక్కును తీసేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అంటే.. సీఈసీగా పని చేసిన వారు వారిపై పదవీకాలంలో మోపిన అభియోగాలపై ఏ చర్యలు తీసుకోవడానికి వీలుండదు. ఈ కేసుల్లో వారిపై జీవితాంతం అరెస్టు కాకుండా చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వోట్ చోరీ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తోందని రాహుల్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

