INDIA Alliance | ఇండియా కూటమిలో సీట్ల లొల్లి.. బెంగాల్లో సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తృణమూల్ 2 సీట్లను కేటాయించనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ భగ్గుమన్నది.
- బెంగాల్లో వీధికెక్కిన విభేదాలు
- సీఎం మమత దయ మాకక్కర్లేదు
- సొంతంగానే ఎక్కువ సీట్లు గెల్చుకుంటాం
INDIA Alliance | కోల్‌కతా, జనవరి 4: ‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తృణమూల్ 2 సీట్లను కేటాయించనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ భగ్గుమన్నది. తమ పార్టీకి సీఎం మమతా బెనర్జీ దయ అవసరం లేదని, సీట్ల కోసం తమ పార్టీ దేహీ అనదని, ఆమె ఇచ్చే దానికన్నా అక్కడ ఎక్కువ సీట్లే సొంతంగా పోటీ చేసి గెల్చుకుంటామని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి గురువారం పేర్కొన్నారు. తృణమూల్ అధ్యక్షురాలైన మమత అసలు ఉద్దేశం ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లడమని, అందుకే ఆమె ఈ రెండు సీట్ల ప్రతిపాదన తెచ్చారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అవసరం మమతకే ఎక్కువగా ఉందని, ఆ విషయం ఆమెకు కూడా తెలుసునన్నారు.
రెండు సీట్లిస్తామని మీకెవరు చెప్పారు?
అధిర్ రంజన్ చౌదరి విమర్శలపై టీఎంసీ అధినాయకత్వం తీవ్రంగా స్పందించింది. నిత్యం చౌదరి, మరికొందరు నేతలు తమ పార్టీపై బురద జల్లుతూ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ ఆరోపించారు. తాము కాంగ్రెస్‌కు రెండే సీట్లు ఇస్తామని ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
‘కన్వీనర్ కాదు.. ప్రధాని పదవివ్వాలి’
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమికి కన్వీనర్‌గా కాకుండా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని జేడీయూ మంత్రులు మదన్ సాహ్ని, రత్నేష్ సాదా గురువారం డిమాండ్ చేశారు. కూటమిలో తాను ఎలాంటి పెద్ద పదవిని ఆశించడం లేదని నితీశ్ ప్రకటించారని.. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలోని అన్ని పార్టీలకు మేలు జరుగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

