న్యూఢిల్లీ, మే 14 : దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది. చాలా తక్కువ ఖర్చుతో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్డీఏఎల్) రూపొందించిన ఈ వ్యవస్థను ఒడిశాలోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో పరీక్షించారు.
ఈ పరీక్షలో ‘భార్గవాస్త్ర’లోని మైక్రో రాకెట్లు నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అధిగమించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు దేశాల డ్రోన్లను గుర్తించి, మైక్రో రాకెట్లతో నిర్వీర్యం చేయగలదు.