న్యూఢిల్లీ: రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా 26 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నది.
ఇందుకు సంబంధించి మరి కొన్ని వారాలలో ఒప్పందం జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వాయుదళ శక్తిని పటిష్టం చేసే లక్ష్యంతో రాఫెల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది.
శక్తివంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండే రాఫెల్ యుద్ధ విమానాలు భారత నౌకాదళ పోరాట శక్తిని బలోపేతం చేస్తాయి. నాలుగేళ్లలో రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.