న్యూఢిల్లీ: విశాఖపట్నం తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి 3,500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల కే-4 విధ్వంసక క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది.
2 టన్నుల అణు బాంబును మోసుకుని వెళ్లగల సామర్థ్యమున్న కే-4 క్షిపణి జలాంతర్గాముల నుంచి దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగలదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట చేపట్టిన కే-సిరీస్ క్షిపణులలో భాగంగా కే-4 తయారైంది. నేటి పరీక్షతో భారత్కు భూమి, ఆకాశం, సముద్రం నుంచి అణ్వస్ర్తాలను ప్రయోగించగల సామర్థ్యం సాధించినట్లేనని అధికారులు తెలిపారు.