న్యూఢిల్లీ: అక్రమ నగదుకు అడ్డుకట్ట వేయడంలో భారత్ సమర్థంగా వ్యవహరిస్తున్నదని ఉగ్రవాద నిధులపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ప్రశంసించింది. భారత్ తమ సిఫారసులు అమలు చేసి అక్రమంగా నిధులు ప్రవేశించకుండా అత్యున్నత సాంకేతిక సామర్థ్యాన్ని పొందిందని పేర్కొన్నది.
భారత్‌కు సైబర్ మోసాలు, అవినీతి, మాదక ద్రవ్యాల రవాణా వంటి అక్రమాలతో మనీ లాండరింగ్ ముప్పు ఉందని పేర్కొన్నది. జమ్ముకశ్మీర్‌తో పాటు చుట్టుపక్కల ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి వంటి ఉగ్ర సంస్థలతో భారత్‌కు తీవ్రమైన ఉగ్రవాద, ఉగ్ర నిధుల ముప్పు ఉన్నట్టు హెచ్చరించింది.