IND-PAK Tension | భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్రం హైఅలెర్ట్ విధించింది. కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచింది. ఈ క్రమంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలోనూ నిఘాను పెంచారు. సైనిక ప్రాంతాల చుట్టూ కూడా భద్రతను పెంచారు. పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ శుక్రవారం కమిషనరేట్‌లోని అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్స్, ఫుట్ పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు. ఆగ్రాలో విమానాశ్రయ ప్రాంతం నుంచి తాజ్ మహల్ వరకు ప్రత్యేక నిఘా పెంచారు. డ్రోన్లను పూర్తిగా నిషేధించారు. ప్రతిరోజూ హోటల్స్‌ని తనిఖీ చేయాలన్నారు. హోటళ్లలో బస చేసే విదేశీయుల గురించి యాజమాన్యం వెంటనే సమాచారాన్ని అధికారులకు అందించాల్సి ఉంటుంది. తాజ్ భద్రతకు సంబంధించి సూచనలు చేసినట్లు సిటీ డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. మాక్ డ్రిల్‌తో పాటు, ఫుట్ మార్చ్ జరుగుతుందని పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. పోలీసుల సెలవులు కూడా రద్దు చేశారు. నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు.