న్యూఢిల్లీ : హెచ్5ఎన్1 వైరస్ (బర్డ్ ఫ్లూ) పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పౌల్ట్రీ ఫారాలు, మార్కెట్ల వంటి హై రిస్క్ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 7న సూచించింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కోసం జాతీయ యాక్షన్ ప్లాన్‌లో తెలిపిన చర్యలను అమలు చేయాలని చెప్పింది. సాంకేతిక సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచాలని, పశు వైద్య, ప్రయోగశాలలు పెంచాలని కోరింది.