చెన్నై: తమిళనాడులో జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫీసుల్లో ఆదాయపన్ను(Income Tax) శాఖ అధికారులు ఇవాళ సోదాలు చేస్తున్నారు. తిరుచ్చి, కోయంబత్తూరులో ఉన్న ఆఫీసుల్లో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. తిరుచ్చి ఆఫీసులోకి నలుగురు సభ్యుల ఐటీ బృందం ఎంటరైంది. దాంట్లో ఓ మహిళా అధికారి ఉన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో జీ స్క్వేర్ ఆఫీసు ఉంది. అక్కడ ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఇక కోయంబత్తూరులోని అవినాషి రోడ్డులో ఉన్న ఆఫీసులో ఐటీ సెర్చ్ జరుగుతోంది. అక్కడికి 10 మంది ఐటీ ఆఫీసర్లు వెళ్లారు. కోయంబత్తూరులోని మహేంద్ర పంప్స్ కంపెనీ ఎండీ మహేంద్ర రామదాస్ ఇంట్లో కూడా ఐటీ శాఖ సోదాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.