నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ఆభరణాల కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ వర్గాలు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతో పాటు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పెట్టుబడులను కూడా లెక్కల్లో చూపలేదు. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు.