న్యూఢిల్లీ: సవరించిన కొత్త ఆదాయ పన్ను బిల్లు(Income Tax Bill)కు ఇవాళ లోక్‌సభలో క్లియరెన్స్ దక్కింది. ఇన్‌కం ట్యాక్స్ నెంబర్ 2 బిల్లును ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆరు దశాబ్ధాల క్రితం నాటి 1961 ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆదాయపన్ను చట్టాలను సరళతరం చేయడమే ఈ చట్టం ఉద్దేశం. కొత్త ఆదాయపన్ను చట్టానికి సంబంధించిన ప్రకటన.. ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో మంత్రి సీతారామన్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను చట్టాన్ని సింపుల్‌గా మార్చనున్నట్లు ఆమె చెప్పారు. ఆ ముసాయిదాను సెలెక్ట్ కమిటీకి పంపారు. బైజయంత్ పండా నేతృత్వంలోని కమిటీ 285 సూచనలు చేసింది. దాదాపు అన్ని సలహాలను ఆమోదించారు. దశాబ్ధాల క్రితం నాటి ట్యాక్స్ చట్టాలు ఇప్పుడు సరళతరం అయ్యాయని పండా తెలిపారు. వ్యక్తిగత పన్నుదారులు, ఎంఎస్ఎంఈలు.. అనవసర గందరగోళం నుంచి తప్పించుకోవచ్చు అన్నారు.
#monsoonsession2025#LokSabha passes The Taxation Laws (Amendment)
Bill, 2025The Bill further amends the Income-tax Act, 1961, and the Finance Act, 2025.@nsitharamanoffc @nsitharaman @LokSabhaSectt@loksabhaspeaker pic.twitter.com/6NJk0EHJeQ
— SansadTV (@sansad_tv) August 11, 2025
1961లో రూపొందించిన ఇన్‌కం ట్యాక్స్ చట్టానికి సుమారు 4 వేల సార్లు సవరణలు జరిగాయి. ఆ చట్టంలో దాదాపు అయిదు లక్షల పదాలు ఉన్నాయి. ఆ చట్టం మరీ సంక్లిష్టంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఆదాయపన్ను బిల్లు దాంట్లో 50 శాతం కుదించుకుపోతుందన్నారు. కొత్త ఆదాయపన్ను చట్టం 2026, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది.
కొత్త ఆదాయపన్ను చట్టంలో జరిగే మార్పులు ఇవే..
ట్యాక్స్ రిఫండ్స్‌పై రిలీఫ్ కల్పిస్తున్నారు. ఒకవేళ ఆల్యంగా రిటర్న్స్ కోసం ఫైలింగ్ చేస్తే, ఆ ట్యాక్స్‌పేయర్స్‌కు రిఫండ్ ఇవ్వనున్నారు. టీడీఎస్ ఫైలింగ్ ఆలస్యం అయినా, దానిపై పెనాల్టీ ఉండదు. నిల్-టీడీఎస్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. పన్ను చెల్లించలేని పన్నుదారులు.. ఒకవేళ ఆదాయపన్ను పరిధిలోకి రాకుంటే, వాళ్లు నిల్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం లక్పించారు. పెన్షన్ జారీ విధానంలో మార్పులు తెచ్చారు. ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ల ను సెక్షన్ 80ఎం కింద జారీ చేయనున్నారు. రెంట్ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్‌లో మార్పులు తెచ్చారు. ట్యాక్స్ స్లాబ్‌లను మార్చారు.