ఇతర రాష్ర్టాల్లో జరుగట్లేదా?
దళిత బాలుడి ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇటువంటి ఘటనలు అన్ని రాష్ర్టాల్లోనూ జరుగుతున్నాయని సోమవారం వ్యాఖ్యానించారు. ‘రోజూ టీవీ, పేపర్లలో ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం’ అన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు
- దళిత బాలుడి మరణంపై రాజస్థాన్ సీఎం గెహ్లాట్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
- దళితులపై దాడులకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
జలోర్, ఆగస్టు 15: దళిత బాలుడి ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇటువంటి ఘటనలు అన్ని రాష్ర్టాల్లోనూ జరుగుతున్నాయని సోమవారం వ్యాఖ్యానించారు. ‘రోజూ టీవీ, పేపర్లలో ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం’ అన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దళిత బాలుడి మరణం అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తు న్నాయని, పోలీసులు ఇప్పటికే టీచర్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
ఇంతకంటే ఏం చేయాలి? అంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. కుండలోని నీరు తాగాడని.. ఓ టీచర్ విచక్షణారహితంగా చితకబాదడంతో ఓ దళిత బాలుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జలోర్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్నది. రాష్ట్రంలో కొన్నేండ్లుగా దళితులపై దాడులు పెరిగాయని, దళితులకు న్యాయం చేయలేని పదవి తనకు వద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కూడా పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

