Watch: మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి.. వీడియో వైరల్
Snakes | మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్ను తనిఖీ చేశారు. ఆ మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు ఖంగు తిన్నారు.
చెన్నై: ఒక మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు (Snakes), ఒక ఊసరవెల్లి (Chameleon) ఉన్నాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video). తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 28న ఒక మహిళ మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే13 విమానంలో తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఆ మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్ను తనిఖీ చేశారు. ఆ మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు ఖంగు తిన్నారు. పాములు పట్టే వారిని రప్పించి ఆ పాములను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆ మహిళపై కస్టమ్స్ యాక్ట్తోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ మహిళను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు కస్టడీ విధించడంతో రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఆ పాములు, ఊసరవెల్లిని అక్రమంగా ఎవరికి రవాణా చేస్తున్నారో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ మహిళ బ్యాగుల నుంచి బయటపడిన పాముల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
#WATCH | Tamil Nadu: On 28th April, a female passenger who arrived from Kuala Lumpur by Flight No. AK13 was intercepted by Chennai Airport Customs. On examination of her checked-in baggage, 22 snakes of various species and a chameleon were found & seized under the Customs Act,… pic.twitter.com/tQCmdElZkm
— ANI_HindiNews (@AHindinews) April 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

