బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 11:11:05

కరోనా ఎఫెక్ట్‌.. ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా పెళ్లి

కరోనా ఎఫెక్ట్‌.. ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా పెళ్లి

లక్నో : కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితమై స్వీయ నియంత్రణ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపును అందరూ పాటిస్తున్నారు. యూపీలోని హర్దోయిలో ఓ జంట వివాహం ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా జరిగింది. పెళ్లి కుమార్తె మెహజబీన్‌, పెళ్లి కుమారుడు హమీద్‌.. తమ తమ నివాసాల్లో ఉన్నారు. ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా మతాధికారి సమక్షంలో నిఖా వినిపించి వివాహం జరిపించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే నూతన వధూవరుల నివాసాల మధ్య కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని ప్రభుత్వం కోరడంతో.. ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా అనుకున్న సమయానికి వివాహం చేసుకున్నామని హమీద్‌ తెలిపాడు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పెళ్లి కుమార్తెను తమ ఇంటికి తీసుకువచ్చి.. పెద్ద వేడుక నిర్వహించుకుంటామని ఆయన పేర్కొన్నాడు.


logo