న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీఎం బంగ్లా వద్ద హైడ్రామా నెలకొన్నది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు షీష్ మహల్ (Sheesh Mahal) ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ దీనిని ఖండించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో కలిసి ఆ బంగ్లా వద్దకు వెళ్లారు. బీజేపీ ఆరోపణలు తప్పని నిరూపించేందుకు, 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆప్ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు.
కాగా, ఈ సందర్భంగా ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ అబద్ధాలు బయటపడ్డాయని అన్నారు. ‘సీఎం నివాసంలో బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఉన్నాయంటూ బీజేపీ నేతలు కొన్ని నెలలుగా గోల చేస్తున్నారు. ఇవాళ మీడియాతో పాటు ఇక్కడకు వచ్చాం. బీజేపీ నేతలు కూడా రావాలని కోరాం. వారు చెప్పిన బంగారు మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉన్నాయో చూడాలనుకున్నాం. అయితే పోలీసులు, వాటర్ ఫిరంగులను మోహరించారు. లోనికి అనుమతిస్తే అసలు నిజం బయటపడేది’ అని అన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ అధికార నివాసం ‘రాజ్ మహల్’ అని ఆప్ నేతలు విమర్శించారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజా ధనంతో నిర్మించిన ప్రధాని లగ్జరీ హౌస్లోకి మీడియాను అనుమతించాలని బీజేపీకి సవాల్ చేశారు. ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ ఆ తర్వాత ప్రధాని నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
#WATCH | After going to Delhi CM residence earlier this morning amid BJP’s ‘sheesh mahal’ allegations, Delhi Minister Saurabh Bharadwaj and AAP MP Sanjay Singh arrived outside the Prime Minister’s residence.
After being denied entry, Saurabh Bharadwaj says, “We came here to… pic.twitter.com/d5hmYvVmao
— ANI (@ANI) January 8, 2025