Gunfire in Manipur | మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య గన్‌ఫైర్
Gunfire in Manipur | మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్‌లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్‌లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత రాత్రి నుంచి తుపాకుల మోత మోగుతున్నది. భద్రతా దళాల లక్ష్యంగా తిరుగుబాటుదారులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అదనపు భద్రతా బలగాలను మోరేకు తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమైన హింస మరో మలుపు తిరిగిందని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలపై తిరుగుబాటుదారులు దాడి చేసే పరిస్థితిగా మారిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య హింస జరుగుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సంఘర్షణ కోణం మారిందని తెలిపారు. తాజాగా తీవ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు పోరాడుతున్నాయని చెప్పారు.
Gunfight between insurgents and security forces continues today in Manipur’s border town Moreh; intermittent firing since last night. Reinforcements have been sent to Moreh. No reports of injuries or casualties. #Moreh #Manipur pic.twitter.com/ue8RWG2YJg
— Debanish Achom (@debanishachom) January 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gunfight
- Insurgents
- Manipur
- Moreh
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

