లక్నో: ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది. దాదాపు 5 స్థానాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఎస్పీ నేత ఒకరైతే తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.
ఇటీవల ఆప్ నేతలు కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తాననడం.. దీనికి కాంగ్రెస్ దీటుగానే బదులివ్వడం తెలిసిందే. లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.