ఇండోర్,ఫిబ్రవరి 25: కాలేజీ ప్రిన్సిపాల్‌పై పూర్వ విద్యార్థి పెట్రోల్ పోసి, తగులబెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకొన్నది. ఇండోర్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ విముక్త శర్మపై మాజీ విద్యార్థి అశుతోష్ శ్రీవాత్సవ గత సోమవారం హత్యాయత్నం చేశాడు. కాలేజీ వద్ద వాహనం ఎక్కుతున్న ఆమెపై పెట్రోలు పోసి సజీవ దహనానికి యత్నించాడు. దీంతో 80 శాతం గాయాలతో సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందింది. తన సర్టిఫికెట్లు ఇవ్వాలని ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తున్నది.