శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 31, 2020 , 20:09:11

కర్ణాటకలో కరోనాతో ఒకేరోజు 84 మంది మృతి

కర్ణాటకలో కరోనాతో ఒకేరోజు 84 మంది మృతి

బెంగళూరు : కర్ణాటక రాష్ర్టంలో చాప కింద నీరులా కరోనా వ్యాపిస్తూ ప్రాణాంతకంగా మారుతోంది. రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడి 84 మంది మృతి చెందగా ఇవాళ 5,483 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,115కు చేరింది. ఇదిలా ఉండగా 49,788 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా 2,314 మంది ఇప్పటివరకు కరోనాతో మృతి చెందారు. 72,005 మంది ప్రస్తుతం కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 

అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో 55,079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16లక్షలు దాటినట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo