Corporate Offices | ఆ రాష్ట్రంలోని కార్పొరేట్ కార్యాలయాల్లో.. ఇకపై బీర్, వైన్ సర్వ్
Corporate Offices | అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది.
చండీగఢ్: అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఆల్కహాల్ కలిగిన వైన్, బీర్ వంటివి కార్పొరేట్ కార్యాలయాల్లో సర్వ్ చేయవచ్చని తెలిపింది. అయితే దీని కోసం 2000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న క్యాంటీన్ లేదా ఈటరీని కార్పొరేట్ ఆఫీసుల్లో ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీకి హర్యానా క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దేశీయ, విదేశీ మద్యంపై ఎక్సైజ్ సుంకం రేట్లను స్వల్పంగా పెంచింది. తద్వారా రూ.400 కోట్ల ఆదాయాన్ని గడించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ నిధులను పర్యావరణం, గో సేవ వంటి జంతు సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొంది.
కాగా, తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ప్రోత్సహించేందుకు మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీలకు చెందిన పానీయాలు, బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని హర్యానా ప్రభుత్వం తగ్గించింది. అలాగే బీర్, వైన్ వినియోగం మాత్రమే ఉండే పబ్ కేటగిరీ లైసెన్స్ ఫీజును మరింత తగ్గించారు. అయితే పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టూ నోటిఫై చేసిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలున్న గ్రామాల్లో మద్యం షాపులు ఉండకూడదని కొత్త ఎక్సైజ్ పాలసీలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

