వారణాసి: భోజ్పురి నటి ఆకాంక్ష దూబే(Akanksha Dubey) అనుమానిత సూసైడ్ కేసులో సింగర్ సమర్ సింగ్కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా నోటీసులిచ్చారు. సార్నాథ్లోని ఓ హోటల్ రూమ్లో నటి ఆకాంక్ష అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో సమర్ సింగ్, సంజయ్ సింగ్లపై అనుమానాలు ఉన్నాయి. ఆ ఇద్దరి ఫోటోలను అన్ని విమానాశ్రయాలకు పంపారు. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆకాంక్ష దూబే పోస్టుమార్టమ్ రిపోర్టుపై లాయర్ శషాంక్ శేఖర్ త్రిపాఠి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆకాంక్ష తల్లి మధు దూబే తరపున శషాంక్ ఈ కేసును వాదిస్తున్నారు. సీబీఐ, సీఐడీ చేత విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 25 ఏళ్ల నటి మరణం సూసూడ్ కాదు అని, హోటల్రూమ్లో ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని లాయర్ శషాంక్ యూపీ సీఎం యోగికి లేఖ రాశారు.