Viral Video : పిక్నిక్ స్పాట్స్, కిచెన్ వెలుపల ఊహించని ప్రదేశాల్లో ప్రజలు ఆహారం తయారుచేసే వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బీచ్‌లో పాస్తా తయారుచేయడం, లారీలో చికెన్ కర్రీ మేకింగ్ నుంచి వాల్కనోపై పిజ్జా చేయడం వరకూ ఈ తరహా వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఇక లేటెస్ట్గా ఓ మహిళ తన టెస్లా కారులో సీఫుడ్ వండిన వీడియో నెట్టింట పలువురిని ఆకట్టుకుంది. ఇన్స్టాగ్రాం రీల్లో అలీసలౌరెన్ అనే వ్లాగర్ తన ఎలక్ట్రిక్ కారులో కూర్చుని తన ఒడిలో చాపింగ్ బోర్డ్ పెట్టుకుని దానిపై ఆలూను కట్ చేయడం కనిపిస్తుంది. ఆమె పక్కనే పోర్టబుల్ టూఇన్1 ఎలక్ట్రిక్ హాట్ పాట్, గ్రిల్ కనిపిస్తుంది. ఆలూ, కట్ చేసిన అల్లం ముక్కలను ఆమె బాయిల్ చేస్తుంది.
గ్రిల్‌పై బటర్ వేసి దానిపై రొయ్యలను కుక్ చేస్తుంది. ఆపై రొయ్యలు, పొటాటోస్, సాసేజ్, ఇతర పదార్ధాలను మిక్స్ చేసి టేస్టీ రెసిపీని సిద్ధం చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఇన్‌స్టా రీల్ ఇన్స్టంట్ సక్సెస్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగ 46 లక్షల మంది వీక్షించారు. కారులో వంటా వార్పు ఏంటని పలువురు యూజర్లు విస్మయం వ్యక్తం చేశారు. కారుపై ఆహారం మరకలు అంటితే ఎలా అని మరికొందరు ప్రశ్నించారు.
Read More :
ఆఫ్టర్ 9.. అంతా రచ్చ.. పబ్ నిర్వాహకుడు సహా ఐదుగురి అరెస్ట్