బంజారాహిల్స్, జనవరి 17: అనుమతులు లేకుండా డీజే నడిపిస్తున్న ఆఫ్టర్ 9 పబ్ నిర్వాహకుడితో పాటు మరో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో రెండు రోజుల క్రితం బర్త్ డే పార్టీలో యువకుల మధ్యన జరిగిన గొడవలో నవీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసుల పరిశీలనలో అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేకుండానే డీజే నడిపిస్తున్నట్లు తేలింది.
దీనికి తోడు అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్న యువతులను పబ్‌లోకి అనుమతించి న్యూసెన్స్‌కు కారణమవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆఫ్టర్ 9 పబ్ భాగస్వామి శివలాల్, లీజు దారుడు వేణుగోపాల్, బౌన్సర్లు కేశవ్, ప్రశాంత్, సాయికుమార్, శేఖర్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం శివలాల్, బౌన్సర్లు కేశవ్, ప్రశాంత్, సాయికుమార్, శేఖర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.