న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఓ క్యూట్ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తన ఫస్ట్ బర్త్డ్ రోజున ఓ చిన్నారి తొలిసారిగా చాక్లెట్ కప్ కేక్‌ను టేస్ట్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రాంలో ప్యుబిటీ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 1.2 కోట్ల మంది వీక్షించారు.
ఈ వీడియోలో చాక్లెట్ కప్కేక్తో ఓ బాబు తన తొలి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. అంతకుముందు అతను ఎన్నడూ చాక్లెట్ కేక్‌ను రుచి చూడలేదు. కేక్‌ను ఎంతబాగా ఇష్టపడ్డాడో బాబు ఎక్స్ప్రెషన్స్ ఇట్టే చెప్పేస్తాయి.
ఈ వీడియోను మెకాబీస్ తల్లి ఎల్లి లిమబిర్ తొలిసారిగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వీడియోను నెటిజన్లు పెద్ద సంఖ్యలో వీక్షించడంతో పాటు కామెంట్ సెక్షన్లో చిన్నారి క్యూట్ లుక్, ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకున్నాయని రాసుకొచ్చారు.