న్యూఢిల్లీ : తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఆపద ఎదురైతే వాటిని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళుతుంది. అందుకు ఈ వీడియోకు మించిన ఎగ్జాంపుల్ మరొకటి ఉండదేమో. ఈ వీడియోలో పక్షి పిల్లలతో ఆడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పక్షి తరిమికొడుతుండటం కనిపించింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసి అక్కడున్న పక్షి పిల్లలతో ఆడేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న వాటి తల్లి ఆ వ్యక్తిని వెంటాడటం కనిపించింది. పక్షి వెంటపడటంతో ఆ వ్యక్తి పరుగుతీశాడు. పక్షి పిల్లల వద్దకు వ్యక్తి రావడాన్ని పసిగట్టిన పక్షి వెంటనే అప్రమత్తమై పేవ్మెంట్ నుంచి దూకి అతడిని వెంబడించింది.
Never mess with someone’s kids. pic.twitter.com/303sjDcHsL
— UOldGuy🇨🇦 (@UOldguy) November 30, 2022
ఈ మొత్తం ఎపిసోడ్‌ను రికార్డు చేసిన మహిళ వ్యక్తి నిస్సహాయ స్ధితి పట్ల నవ్వుకోవడం మినహా ఎలాంటి సాయం అందించలేకపోయింది. కొందరి బిడ్డల జోలికి ఎన్నడూ వెళ్లకండని ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోకు క్యాప్సన్గా ఇచ్చారు. ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం 3000కుపైగా వ్యూస్ లభించాయి.