న్యూఢిల్లీ : తన ఇండియన్ హజ్బెండ్ కోసం జర్మనీ మహిళ దేశీ టిఫిన్ తయారు చేస్తున్న వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంచ్ కోసం కేవలం భారతీయ డిషెస్నే ఆయన ఎంచుకుంటారని మహిళ చెప్పుకొచ్చారు. భర్త కోసం ఇండియన్ ఫుడ్ సిద్ధం చేసేందుకు ఆమె వెనుకాడరు. ఇన్స్టాగ్రాం రీల్లో జర్మన్ మహిళ తన భర్త కోసం నల్ల శనగల కూర, రోటీలను రెడీ చేయడం కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో ఆమె శనగలు, నీటిని కుక్కర్లో వేసి, ఉప్పు జోడించి మూత బిగించడం చూడొచ్చు.
ఆపై ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని సిద్ధం చేస్తుంది. మరో ప్యాన్‌లో నూనెను వేడిచేసి అల్లం వెల్లులి పేస్ట్, పసుపు, మరికొన్ని స్పెసెస్ను వేసి వీటిని కుక్కర్లో ఉడికించిన శనగల్లో మిక్స్ చేస్తుంది. కర్రీ సిద్ధమైన వెంటనే ఆమె రోటీలను తయారుచేస్తుంది. నా భర్త భారత్‌లోని అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తి కావడంతో నేను ఇండియన్ ఫుడ్ తయారుచేయడం నేర్చుకున్నా..కొందరికి విదేశీ కల్చర్‌కు చెందిన ఫుడ్‌ను వండివార్చడం భారం కావచ్చు..కానీ నాకు మాత్రం ఇండియన్ ఫుడ్ సిద్దం చేయడం ప్యాషన్ అంటూ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ జోడించింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 5.6 లక్షల మంది వీక్షించారు. భర్త కోసం మహిళ ఇష్టంగా దేశీ వంటకాలను సిద్ధం చేయడంపై పలువురు ప్రశంసలు గుప్పించారు. నా కంటే మీ రోటీలే బావున్నాయని ఓ యూజర్ కామెంట్ చేయగా, మిమ్మల్ని భార్యగా పొందడం మీ భర్త అదృష్టమని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Jailer Movie | రజనీకాంత్‌కు రూ.200 కోట్ల రెమ్యునరేషన్.. నిజమా పుకారా?