న్యూఢిల్లీ : ఎన్నిసార్లు తగవులాడినా బ్రదర్, సిస్టర్ మధ్య అనుబంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే . వీరి బాండింగ్ అనేది ఎమోషనలే కాకుండా అందమైనది కూడా. ఇక ఓ అన్న తన చెల్లెలి కోసం స్కూటీని గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోదరుడి నుంచి ఊహించని గిఫ్ట్‌ను అందుకున్న చెల్లెలి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్‌లో సోదరుడు పక్కనుండగా ఐశ్వర్య గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తుండటం కనిపిస్తుంది. బాక్స్ లోపల కీ ఉండటం చూసి ఆమె ఉద్వేగానికి లోనవుతుంది. అన్న తనకు స్కూటీని గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలియగానే ఆనందంతో కండ్లు చెమర్చి అతడిని హగ్ చేసుకోవడం కనిపించింది.
ఐశ్వర్య తన స్కూటీపై చక్కర్లు కొట్టింది..ప్యూర్ లవ్ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 90 లక్షల వ్యూస్ లభించాయి. మీ బ్రదర్‌కు శాల్యూట్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎంత మధురమైన క్షణమని మరో యూజర్ అన్నా చెల్లెళ్ల బాండింగ్‌ను మెచ్చుకున్నారు.