ముంబై : ఉరుకుల పరుగుల జీవితంలో సేద తీరేందుకు సరదాగా అలా బీచ్‌కు వెళ్లిన వారిని ఓ వ్యక్తి విన్యాసం ఆకట్టుకుంది. జుహు బీచ్‌లో అతడు ఏకంగా వెనుకకు మళ్లుతూ నాన్‌స్టాప్‌గా 42 పల్టీలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగవైరలవుతుంది.
సల్మాన్ ఖాన్ అనే అధ్లెట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 4.5 కోట్ల మంది వీక్షించారు. ఆ వ్యక్తి నైపుణ్యాలు ఇంటర్నెట్ను షేక్ చేశాయి. ఈ వ్యక్తికి శాల్యూట్ అని ఓ యూజర్ కామెంట్ సెషన్లో రాసుకొచ్చారు. 42 పల్టీలంటే మాటలు కాదు..నువ్వు చరిత్ర లిఖించావు బ్రదర్ అని మరో యూజర్ ప్రశంసించగా వీడియోను షేర్ చేసినందుకు సల్మాన్‌ను పలువురు అభినందించారు.