ముంబై : మహారాష్ట్ర రాజధానిలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ముంబై పోలీసులకు బుధవారం ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హెల్ప్‌లైన్ నెంబర్ 112కు కాల్ చేసిన వ్యక్తి ముంబైలో మూడు బాంబు పేలుళ్లు జరుగుతాయని బాంబు పేల్చాడు.
తదుపరి చర్యలు తీసుకునేందుకు ముంబై పోలీసులు కాలర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంధేరిలోని ఇన్ఫినిటీ మాల్, జుహు పీవీఆర్ మాల్, సహారా హోటల్ వద్ద పేలుళ్లు జరుగుతాయని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని పోలీసులు తెలిపారు.
బాంబు హెచ్చరికలతో సహార ఎయిర్పోర్ట్ పోలీసులు, జుహు, అంబోలి, బంగూర్ నగర్ పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్, బీడీడీఎస్ బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఫోన్ కాల్‌పై దర్యాప్తు చేపట్టారు. కాలర్ ఎవరనేది గుర్తించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.