Delhi Heat Wave | దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో దాదాపు 12 ఏండ్ల తర్వాత ఈ వేసవిలో వేడి గాలులు వీయలేదని వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. ఈ నెలాఖరులోగా వేడి గాలులు వీయబోవని భావిస్తున్నట్లు వాతావరణ శాఖ సఫ్దర్ జంగ్ విభాగం వెల్లడించింది. ప్రతియేటా ఒక్కసారైనా ఢిల్లీలో వేడి గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రీజినల్ అధికారి కుల్దీప్ శ్రీవాత్సవ చెప్పారు.
పశ్చిమ ప్రాంతంలో ప్రత్యేకంచి అవాంతరాల నేపథ్యంలో వేడిగాలులు వీయనందున అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యదరా ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల వల్ల మార్చి నుంచి జూన్ వరకు వాయవ్య భారత్ ప్రాంతంలో అకాల వర్షపాతం నమోదైందని తెలిపారు.
గత నెలలో ఢిల్లీలో 111 ఎంఎం (262 శాతం) వర్షపాతం నమోదైంది. దీర్ఘకాలికంగా ఏండ్ల తరబడి ఢిల్లీలో సగటు 30.7 ఎంఎం వర్షపాతం రికార్డవుతూ వచ్చింది. 2017 తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో 20 మిమీ వర్షపాతం నమోదైంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో వేడిగాలుల వాతావరణం నెలకొంది. వచ్చే ఆరేడు రోజుల్లో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తున్నది.