కోల్‌కతా : ఓ కొవిడ్ రోగి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన డెడ్‌బాడీని మెడికల్ రీసెర్చ్ కోసం తీసుకోవాలని వైద్యులకు చెప్పాడు. అయితే చికిత్స పొందుతుండగానే కొవిడ్ రోగి చనిపోయాడు. అతను చెప్పినట్లుగానే ఆ రోగి డెడ్‌బాడీని మెడికల్ రీసెర్చ్ కోసం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. ఈ ఘటన కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. 89 ఏండ్ల నిర్మల్ దాస్ కరోనా బారినపడ్డాడు. ఆయనకు క్యాన్సర్ కూడా ఉంది. మొత్తానికి కరోనాతో పోరాడి ఓడిపోయాడు నిర్మల్ దాస్.
పశ్చిమ బెంగాల్లో శనివారం కొత్తగా 3,805 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క కోల్‌కతాలోనే 481 కేసులు నమోదు అయ్యాయి. బెంగాల్లో కొవిడ్ కేసుల సంఖ్య 19,86,667కు చేరింది. కొవిడ్ మృతుల సంఖ్య 20,515కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.