న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరువవడంతో ఇంటర్నెట్లో పెద్దసంఖ్యలో వీడియోలు, పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు సంకేతంగా అన్నట్టు ఓ వ్యక్తి సైకిల్‌పై 9 మంది పిల్లలతో వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16) November 15, 2022
జైకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.5 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని వెళుతుండటం కనిపించింది. ముగ్గురు పిల్లలు సైకిల్ వెనుక కూర్చోగా, వారిపై ఒకరు కూర్చున్నారు.
ఇక ఇద్దరు పిల్లలు ముందు భాగంలో కూర్చోగా మరొకరు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఇద్దరు పిల్లలను తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఈ క్లిప్‌ను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఇంత మంది పిల్లలా అని ఓ యూజర్ రాయగా, బాధ్యతగా మెలగండి..వారిలో అవగాహన పెంచే బాధ్యత పాలకులదేనని మరో యూజర్ కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.