న్యూఢిల్లీ: ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1) మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఛిం ద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవడంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేమోననే ఆందోళన ప్రబలుతున్నది.
ఈ వైరస్ సోకిన పిల్లులన్నీ తీవ్ర జ్వరం, ఆకలి కోల్పోవడం, నిద్రమత్తుతో బాధపడినట్లు, నమూనాలను సేకరించిన ఒకటి నుంచి మూడు రోజుల్లోనే ఇవి మరణించినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మొత్తం మీద ఈ వైరస్ 27 పరివర్తనలను శాస్త్రవేత్తలు గుర్తించారు.