న్యూఢిల్లీ: ఫిబ్రవరి మండిపోయింది. ఆ నెలలో ఈసారి ఎండలు దంచికొట్టాయి. ఐఎండీ(IMD) ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1901 సంవత్సరం నుంచి ఫిబ్రవరి(February)లో అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temperatures) నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే మార్చిలో వర్షాలు కురవడం వల్ల కొంత వరకు టెంపరేచర్లు అదుపులో ఉన్నాయి. ఇక గత ఏడాది మార్చిలో మాత్రం.. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గడిచిన 121 సంవత్సరాల్లో గత ఏడాది మార్చి .. వార్మెస్ట్ రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇక బెంగాల్, ఒడిశా, ఏపీ, బీహార్‌లో ప్రస్తుతం వేడి ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. రానున్న నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో టెంపరేచర్లు ఉంటాయన్నారు. సెంట్రల్, ఈస్ట్, నార్త్‌వెస్ట్ ప్రదేశాల్లో ఈ ఏడాది నార్మల్ స్థాయి కన్నా అధికంగా హీట్‌వేవ్ ఉంటుందన్నారు.