Sharad Pawar, Ajit Share Stage | రెండు వారాల్లో మూడోసారి.. వేదిక పంచుకున్న శరద్ పవార్, అజిత్ పవార్
Sharad Pawar, Ajit Share Stage | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి. (Sharad Pawar, Ajit Share Stage) ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇది చర్చకు దారి తీసింది. సోమవారం పూణెలోని సఖర్ సంకుల్ (షుగర్ కాంప్లెక్స్)లో జరిగిన సమావేశంలో శరద్ పవార్, అజిత్ పవార్ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ అధికారులు కూడా హాజరయ్యారు.
కాగా, ఈ సమావేశం తర్వాత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి, భూసారాన్ని మెరుగుపరచడానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి ఏఐని ఉపయోగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
మరోవైపు శరద్ పవార్, అజిత్ పవార్ తిరిగి దగ్గరవుతున్నట్లుగా గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో మూడోసారి శరద్ పవార్తో వేదిక పంచుకోవడం గురించి అజిత్ పవార్ను మీడియా అడిగింది. అయితే వేరే కోణంలో దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తన కుమారుడు జై నిశ్చితార్థం తర్వాత మరో కార్యక్రమంలో తామిద్దరం కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశాలకు రాజకీయ ప్రాముఖ్యత లేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

