తలసరిలోనూ నేలచూపులే!
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేలింది.
- మోదీ హయాంలో ఆర్థికం ఆగమాగం
- మొన్న జీడీపీలో.. నేడు తలసరిలో డౌన్
- మన కంటే బంగ్లాదేశ్ ఇంకెంతో మెరుగు
- ప్రపంచ తలసరి ఆదాయంతో పోలిస్తే, భారతీయుడి తలసరి 12 లక్షలు తక్కువ
- ఐఎంఎఫ్ తాజా అంచనా
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేలింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో నిత్యం కొట్టుమిట్టాడే పొరుగు దేశం బంగ్లాదేశ్ మనకంటే తలసరిలో ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం. ఈ మేరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా అంచనాల్లో వెల్లడైంది.
వెనుకబాటే..
దేశ జీడీపీని ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ వ్యక్తి తలసరి ఆదాయంగా చెప్తారు. ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్-2026’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2,911 డాలర్ల (రూ.2.74 లక్షలు)కు చేరుతుందని అంచనా వేసింది. ఇదే సమయంలో భారతీయుల తలసరి ఆదాయం 2,812 డాలర్లు (రూ.2.65 లక్షలు)గా ఉండొచ్చని పేర్కొన్నది. అంటే ఒక్కో భారతీయుడి కంటే, బంగ్లాదేశ్ పౌరుడు సగటున రూ. 9 వేలను ఎక్కువగా సంపాదించగలడని నివేదికను బట్టి అర్థమవుతున్నది. ఇక, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు తలసరి ఆదాయం సుమారు 7,500 డాలర్లుగా ఉండగా, ప్రపంచ సగటు తలసరి 15,600 డాలర్లుగా (రూ. 14.69 లక్షలు) ఉన్నది. ఈ లెక్కన చూసుకొన్నప్పటికీ, ప్రపంచ తలసరి కంటే, భారత తలసరి 12,788 డాలర్లు (రూ. 12.04 లక్షలు) తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
జీడీపీలోనూ అంతే
తలసరిలోనే కాదు ఆర్థిక వ్యవస్థ పరిమాణంలోనూ (జీడీపీ) భారత్ ఒక ర్యాంకును కోల్పోయింది. ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం.. 2025లో దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3.92 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. దీంతో గతంలో భారత్ కంటే ఒక ర్యాంకు వెనుకంజలో ఉన్న బ్రిటన్.. ఇండియాను తోసిరాజని ఐదో స్థానానికి దూసుకెళ్లింది. 5వ ర్యాంకులో ఉండాల్సిన భారత్ 6వ స్థానానికి పరిమితమైంది. 2024లో జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ 5వ స్థానానికి రాగానే, అదంతా తమ ఘనతేనని ప్రచారం చేసుకొన్న మోదీ పరివారం.. ఇప్పుడు మాత్రం నోరు మెదపట్లేదు.
- ప్రపంచ సగటు తలసరి ఆదాయం: రూ. 14.69 లక్షలు
- భారత్‌లో సగటు తలసరి ఆదాయం: రూ. 2.65 లక్షలు
- వ్యత్యాసం: 12.04 లక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- BJP
- IMF
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

