Summer | న్యూఢిల్లీ: ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటుకు మించిపోతాయని తెలిపింది.
మార్చి నుంచి మే నెల వరకు ఇదే ధోరణి కొనసాగుతుందని తెలిపింది. అయితే, దక్షిణాది, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువగా నమోదుకావచ్చునని వివరించింది. 1901 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలించినపుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.