హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నా గాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ వివరించింది.